ట్రిపుల్​ ఐటీని సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జానకీ షర్మిల బుధవారం సందర్శించారు. క్యాంపస్​ను తనిఖీ చేసిన వర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎస్పీ భోజనం  చేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని కోరారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, ముథోల్​ సీఐ మల్లేశ్, ఎస్​ఐ గణేశ్ ఉన్నారు.