ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు:  జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని నిర్మల్​కలెక్టర్​ అభిలాష అభినవ్ ఎన్​డీఆర్ ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం గండి రామన్న సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కలిసి పలు సూచనలు చేశారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందినా వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు, లైఫ్ జాకెట్లు, తదితర సామగ్రిని పరిశీలించారు. 

బాల సాహిత్యానికి ప్రచారం కల్పించాలి

బాల సాహిత్య పుస్తకాల వల్ల విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తి పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో రూమ్ టూ రీడ్ సంస్థ ఏర్పాటు చేసిన మొబైల్​ లైబ్రరీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. వాహనంలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామాల్లోని ముఖ్య కూడళ్ల వద్ద పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, విద్యానైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీఆర్వో భుజంగ్ రావు, డీఈఓ రవీందర్ రెడ్డి, రూమ్ టు రీడ్ జిల్లా ఇన్​చార్జి రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.