నిర్మల్ జిల్లాలో మండుతున్న ఎండలు.. ఇకపై టెలిఫోన్ ప్రజావాణి

నిర్మల్ జిల్లాలో మండుతున్న ఎండలు.. ఇకపై టెలిఫోన్ ప్రజావాణి

నిర్మల్, వెలుగు: ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు వెసులుబాటుగా టెలిఫోన్ ప్రజావాణి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు టెలి ఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇంటి వద్ద నుంచే 91005 77132 నంబర్​ను సంప్రదించి నేరుగా తమ సమస్యలను తెలిపి, దరఖాస్తులను వాట్సాప్ ద్వారా పంపవచ్చన్నారు. 

ఆ దరఖాస్తులను పరిశీలించి, ఆన్​లైన్​లో నమోదు చేసి పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యథావిధిగా సాధారణ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని దూర ప్రాంత ప్రజలు టెలిఫోన్ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.