రాయదారి గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం  : కలెక్టర్ అభిలాష అభినవ్ 

రాయదారి గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం  : కలెక్టర్ అభిలాష అభినవ్ 

పెంబి, వెలుగు: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని రాయదారి గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులను కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం అధికారులు, సిబ్బందితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన కలెక్టర్..  తక్షణ సాయం కింద శనివారం వరకు లక్ష రూపాయలు బాధితుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. .

బాధితులకు నిత్యావసర సరకులు, దుస్తులు  అందజేశారు.  బాధితుల పునరావాసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కలెక్టర్ బాధితులతో కలిసి భోజనం చేసి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి నరసింహ రెడ్డి, డీఎస్ఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీఓ రమాకాంత్, అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.