
నిర్మల్, వెలుగు: సోన్, సోఫీ నగర్‌లోని కేజీబీవీల్లో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, వంట సామగ్రిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ తరగతి గదిలో నేలపై కూర్చొని విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం వారికి కొద్దిసేపు పాఠాలు బోధించారు.
గణితంపై ప్రశ్నలు అడిగి బోర్డుపై జవాబులు రాయించారు. దాదాపు గంటకు పైగా కలెక్టర్ తరగతి గదిలోనే ఉండి విద్యార్థులకు ఈజీ మెథడ్‌లో టీచింగ్ చేశారు. ముథోల్ మండలం చింతకుంట ప్రైమరీ స్కూల్‌ను డీఈవో రామారావు తనిఖీ చేశారు.