భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం : అభిలాష అభినవ్​

భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం : అభిలాష అభినవ్​
  • కలెక్టర్​ అభిలాష అభినవ్​

భైంసా, వెలుగు: వసంత పంచమి సందర్భంగా బాసర అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారు లను ఆదేశించారు. ఆదివారం బాసర ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై అరా తీశారు. అంతకుముందు కలెక్టర్ అమ్మవారిని దర్శించుకున్నారు. 

అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి క్యూలైన్లు, అక్షరాభ్యాస మండపాలు, వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఆర్డీఓ కోమల్ రెడ్డి, ఈఓ సుధాకర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.