రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్

రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ప్రజా పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డీలర్లను ఆదేశించారు.  గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ప్రజా పంపిణీపై పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు రేషన్ బియ్యం, నాణ్యమైన సరుకులు అందించాలని, రేషన్ షాప్ డీలర్లు సరుకులను సక్రమంగా లబ్ధిదారులకు అందించాలన్నారు.  .

బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ షాపుల్లో సరుకు నిల్వ, వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్  అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీఓ రత్నకల్యాణి, డీఎస్ఓ కిరణ్ కుమార్, డీఎం గోపాల్, అధికారులు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు