బాలశక్తిని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

బాలశక్తిని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బాలశక్తి కార్యక్రమం అమలు తీరుపై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులతో జూమ్ కాల్ ద్వారా రివ్యూ నిర్వహించారు. బాలశక్తి కార్యక్రమాన్నీ పక్కాగా అమలు చేయాలన్నారు. విద్యార్థులందరికీ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సమగ్ర ఆరోగ్య కార్డులను తయారు చేయాలని సూచించారు. 

వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక పోషకాహారం, మందులు అందజేయాలన్నారు. పలు కోర్సులు నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలని, ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. విద్య, వైద్యం, ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేలా క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో పి.రామారావు, విద్యశాఖ అధికారులు సలోమి కరుణ, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.