![పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ అభిలాష అభినవ్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-abhilasha-abhinav-visited-kgbv-school-and-inspected-the-hostels-in-maskapur_dSt3OGyPXv.jpg)
ఖానాపూర్, వెలుగు: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని 10వ వార్డులో కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ నెల10 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డుల్లో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజల సహకారం అవసరమన్నారు. అనంతరం ఖానాపూర్ మండలం మస్కాపూర్ లోని కేజీబీవీ స్కూల్‌ను కలెక్టర్ సందర్శించి కిచెన్, సరుకుల నిల్వ గది, వసతి గృహాలను పరిశీలించారు.
కేజీబీవీ పరిసరాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. టెన్త్ విద్యార్తులు ఫైనల్ఎగ్జామ్స్కు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలన్నారు. సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని పిచ్చి మొక్కల్ని తొలగించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఈవో పి.రామారావు, డీపీవో శ్రీనివాస్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ సుజాత, సీపీవో జీవరత్నం, ఎంపీడీవో సునీత, ఎంపీవో రత్నాకర్ తదితరులున్నారు.