లారీలు లేటుగా పంపితే కాంట్రాక్టు రద్దు .. రివ్యూ మీటింగ్‌‌‌‌లో కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

లారీలు లేటుగా పంపితే కాంట్రాక్టు రద్దు .. రివ్యూ మీటింగ్‌‌‌‌లో కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు పంపించాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్ల అనుమతి రద్దు చేసి ఇతరులకు ఇవ్వాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అడిషనల్​  కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు.  సోమవారం కలెక్టర్  ఛాంబర్ లో వ్యవసాయ,  కో ఆపరేటివ్, సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులతో ధాన్యం తరలింపు పై రివ్యూ మీటింగ్​నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు.  గోపాల్ పేట, పెద్ద మందడి, పొల్కేపాడు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తరలించేందుకు సిద్ధంగా ఉందని వడ్లు తరలించేందుకు  వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. మీటింగ్​లో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి . రాణి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్​ అన్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు  సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి.  అనంతరం రెడ్ క్రాస్ ద్వారా రూపొందించిన యాంటీ డ్రగ్స్ అవగాహన గోడ పత్రికను అదనపు కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి విడుదల చేశారు.