డిజిటల్​ క్రాప్​ బుకింగ్​ పక్కాగా చేయాలి :  కలెక్టర్‌‌‌‌‌‌‌‌  ఆదర్శ్  సురభి

డిజిటల్​ క్రాప్​ బుకింగ్​ పక్కాగా చేయాలి :  కలెక్టర్‌‌‌‌‌‌‌‌  ఆదర్శ్  సురభి

పెబ్బేరు/కొత్తకోట, వెలుగు: జిల్లాలో డిజిటల్  క్రాప్  బుకింగ్(పంటల నమోదు) సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌  ఆదర్శ్  సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామానికి చెందిన రైతు నాగరాజు పొలం వద్ద క్రాప్  బుకింగ్  సర్వేను పరిశీలించారు.

అనంతరం కంచిరావుపల్లి, కొత్తకోట పట్టణంలోని జడ్పీ హైస్కూళ్లను సందర్శించి పంచాయతీరాజ్  శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. డీఎంఎఫ్ టీ నిధులతో చేపట్టిన పనులను పరిశీలించి, ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఏవో గోవింద్​నాయక్, పెబ్బేరు, కొత్తకోట తహసీల్దార్లు లక్ష్మి, వెంకటేశ్వర్లు, పీఆర్​ ఏఈలు నరేశ్, కార్తీక్  పాల్గొన్నారు.