
వనపర్తి, వెలుగు: ఎకో పార్క్‌లో వివిధ రకాల మొక్కలను నాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మరికుంటలో గల పార్క్‌ను జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్ రెడ్డితో కలిసి సందర్శించారు. నిత్యం పార్క్‌కు ఎంతమంది వస్తున్నారని ఆరా తీశారు.
వాకర్స్ కి ఇబ్బంది కలగకుండా ట్రాక్ ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.ఎంట్రెన్స్ వద్ద, లోపల ముఖ్యమైన ప్రదేశాల్లో ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు జంతువుల బొమ్మలు సహా ఇతర ఆట సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.