ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి : కలక్టర్ ఆదర్శ్ సురభి

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి : కలక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కలక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో మండల స్థాయి మాస్టర్  ట్రైనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఎన్నికల కమిషన్  ఇచ్చిన నియమ నిబంధనలు పాటించాలని, పోలింగ్  సిబ్బంది తమకు తోచినట్లు వ్యవహరించవద్దన్నారు. 

మాస్టర్  ట్రైనర్  శ్రీనివాస్  మండల ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్  పేపర్ల ద్వారా నిర్వహిస్తుండడంతో, బ్యాలెట్  బాక్సు ఓపెన్  చేయడం, సీల్ చేయడం, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. అడిషనల్​ కలెక్టర్  సంచిత్  గంగ్వార్  పాల్గొన్నారు.

శానిటరీ వర్కర్స్​ సంక్షేమానికి చర్యలు

మున్సిపాలిటీలు, గ్రామాల్లో పని చేసే శానిటరీ వర్కర్స్​ సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. జిల్లాస్థాయి విజిలెన్స్  అండ్  మానిటరింగ్  కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పని చేసే పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. డీపీవో సురేశ్, జడ్పీ సీఈవో యాదయ్య పాల్గొన్నారు.