పెండింగ్​ దరఖాస్తులు క్లియర్​ చేయాలి : కలెక్టర్  ఆదర్శ సురభి

పెండింగ్​ దరఖాస్తులు క్లియర్​ చేయాలి : కలెక్టర్  ఆదర్శ సురభి
  • .పీఎం విశ్వకర్మ పథకంపై కలెక్టర్  రివ్యూ

వనపర్తి, వెలుగు: జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్ లో ఉన్న పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే క్లియర్​ చేయాలని కలెక్టర్  ఆదర్శ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో వివిధ కులవృత్తులకు సంబంధించి పీఎం విశ్వకర్మ కింద ఎంపికై శిక్షణ తీసుకున్న లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి దివ్యాంగుడికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూడీఐడీ( యూనిక్  డిజేబుల్  ఐడీ)ని అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. భవిష్యత్​లో యూడీఐడీ పోర్టల్  ద్వారానే దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేస్తారన్నారు. అడిషనల్​ కలెక్టర్  యాదయ్య, ఎంఎస్ఎంఈ ఏడీ శివరాం ప్రసాద్, ఇండస్ట్రీస్​ జీఎం జ్యోతి, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ ఇందిర, డీఆర్డీవో ఉమాదేవి, ఎల్డీఎం కౌశల్  కిశోర్ పాండే పాల్గొన్నారు.