![వనపర్తి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు : కలెక్టర్ ఆదర్శ్ సురభి](https://static.v6velugu.com/uploads/2025/02/collector-adarsh-surabhi-instructed-officials-to-prepare-proposals-for-road-development-in-wanaparthy-district_HOy1ojnpUA.jpg)
వనపర్తి, వెలుగు : జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్ లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి రోడ్స్ అండ్ బిల్డింగ్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమావేశం హైబ్రిడ్ యన్యూటీ మోడల్ ప్రొగ్రాం కింద జిల్లా కేంద్రం నుంచి హైవే రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి రోడ్డు అభివృద్ధి కి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. ఆర్అండ్ బీ కింద వనపర్తి- కొత్తకోట రోడ్డు ను కొత్తకోట వరకు నాలుగు వరసల రోడ్డు, వనపర్తి నుంచి వయా బిజినేపల్లి మీదుగా జడ్చర్ల రోడ్డు ను నాలుగు వరసల రోడ్డు గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు.
వనపర్తి పెబ్బేరు రోడ్డు, రాజనగరం నుంచి పెద్దమందడి రోడ్డు ను రెండు వరసల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి మండలానికి బీటీ రోడ్డు అనుసంధానం లేని పెబ్బేరు మండలం రాంపూర్ నుంచి రామమ్మ పేట, కనిమెట్ట నుంచి పాత జంగమాయపల్లి వరకు 7.30 కి.మీ రోడ్డును బీటీ గా మార్చేందుకు ప్రతిపాదన లను రూపొందించాలన్నారు. సమావేశంలో ఆర్అండ్ బీ ఈఈ దేశ్యానాయక్, పీఆర్ ఈఈ మల్లయ్య, డీఈ సీతారామ స్వామి తదితరులు పాల్గొన్నారు.