ఆడపిల్లలను చదివించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఆడపిల్లలను చదివించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : సమాజంలో ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరు వారు బాగా చదువుకునేలా  ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.  కేంద్ర ప్రభుత్వం బాలికల అభ్యున్నతికి "బేటి బచావో బేటి పడావో" కార్యక్రమం ప్రారంభించి జనవరి 22వ తేదీకి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 8వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  

ఇందులో భాగంగా, గురువారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో  సంతకాల సేకరణ, బేటి బచావో బేటి పడావో కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్లను కలెక్టర్ అడిషనల్​ కలెక్టర్లు  సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్​ ఆఫీసర్​ సుధారాణి, డీఎంహెచ్​వో  శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.