
వనపర్తి, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది రోగులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా ఆస్పత్రిలోని ఎన్ సీడీ విభాగాన్ని సందర్శించారు. క్యాన్సర్, బీపీ, షుగర్ రోగులకు అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. ఫార్మసీ స్టోరును సందర్శించి, ఆస్పత్రికి వచ్చిన రోగులకు అన్ని మందులు ఇక్కడే ఇవ్వాలని సూచించారు.
అనంతరం, రోగుల వార్డులోకి వెళ్లి వారితో మాట్లాడారు. ఆయన వెంట డీఎంహెచ్వో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ రంగారావు, ఎన్ సి డి డాక్టర్ రామచంద్ర, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.