
వనపర్తి, వెలుగు: జిల్లాలో స్థానిక అవసరాల మేరకు ఇసుక వాడుకోడానికి అందుబాటులో ఉన్న రీచ్‌లను వెరిఫై చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్ పూర్, పెద్దమందడి మండలం చిలకటోని పల్లి, మదనాపురం మండలం కరివెన, దుప్పల్లి, ఆత్మకూరు మండలం వీరరాఘవాపురం రీచ్ లను వెరిఫై చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఫిల్టర్ ఇసుక దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలించేందుకు వీలు లేదన్నారు. ఇసుక అవసరం ఉంటే ‘మన ఇసుక వాహనం’ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. మైనింగ్ అధికారి గోవిందరాజు, డీపీవో సురేశ్, సూపరింటెండెంట్ కిషన్ పాల్గొన్నారు.