సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వాడొద్దు : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వాడొద్దు : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు: సింగిల్  యూజ్  ప్లాస్టిక్ ను వాడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి కోరారు. గురువారం స్వచ్ఛదనం, -పచ్చదనంలో భాగంగా ఆరోగ్య సంరక్షణ దినాన్ని పాటించారు. మహిళా సమాఖ్య భవన్​లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రమదానంతో కాలనీ, వార్డుల్లోని ప్రభుత్వ భవనాల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు తొలగించేలా చూడాలన్నారు. జిల్లాలో దోమల నివారణ కోసం  ప్రతి శుక్రవారం డ్రై డేను నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంట్లో, పరిసరాల్లో నిలువ నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిలువ నీటిలో డెంగ్యూ, మలేరియా, చికెన్  గున్యా వ్యాప్తి చేసే దోమలు వృద్ధి చెందుతాయన్నారు.

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు

జిల్లాలో వీధి కుక్కల సంతతిని తగ్గించడానికి రోజుకు కనీసం 10 కుక్కలకు జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలని కలెక్టర్​ అన్నారు. జిల్లా కేంద్రం శివారులోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అడిషనల్​ కలెక్టర్​ సంచిత్​ గంగ్వార్, కమిషనర్​ పూర్ణచందర్​ పాల్గొన్నారు.