ఉగాదిలోపు డబుల్ ​బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

ఉగాదిలోపు డబుల్ ​బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

పెబ్బేరు/కొత్తకోట, వెలుగు : ఉగాది లోపు జిల్లాలో వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్​ఆదర్శ్​ సురభి అన్నారు. మంగళవారం కొత్తకోట మండలం పామాపురం, పెబ్బేరు మండలం పాతపల్లె గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పామాపురం గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం 56 ఇండ్లు  మంజూరవగా అవి పూర్తయి లబ్ధిదారులకు కేటాయింపులు జరిగాయి.  

ఇంకొందరికి అవసరమని గ్రామస్తులు ఎన్నికల ముందు మరో 25 ఇండ్లు మంజూరు చేయించుకున్నారు. వాటిలో ప్రస్తుతం  కొన్ని రూఫ్, బెస్మెంట్ లెవల్, కొన్ని ఫైనల్ స్టేజికి వచ్చాయని పీఆర్​ ఈఈ మల్లయ్య కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  తెలిపారు. పెబ్బేరు మండలం పాతపల్లిలో 50 ఇండ్లు  మంజూరు కాగా అవి అన్ని రూఫ్ లెవల్ పూర్తి కాగా, గోడలు, ప్లాస్టరింగ్ తదితర పనులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. పెబ్బేరు  తహసీల్దార్ లక్ష్మి, ఎంపీవో రోజా, కాంట్రాక్టర్ షణ్ముఖి, తదితరులు  పాల్గొన్నారు.