వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి పట్టణంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి స్థాయిలో సౌలతులు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ అండ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్‌రెడ్డి కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కాలేజీలో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
కాలేజీ అభివృద్ధి కోసం రూ.100 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు అయినప్పటికీ, ఫండ్స్ ఇంకా విడుదల కాలేదని పేర్కొన్నారు. నిధులు లేక విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ పూర్తి వివరాలు ఇస్తే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫండ్స్ మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ రాంనరేశ్ పాల్గొన్నారు.