అండర్​ టేకింగ్​ ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం : కలెక్టర్ ఆదర్శ్ సురభి 

అండర్​ టేకింగ్​ ఇస్తేనే మిల్లర్లకు ధాన్యం : కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, వెలుగు:  జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైస్ మిల్లర్లు అంగీకార పత్రం ఇస్తే ధాన్యం కేటాయిస్తారని  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.  బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లుతో కలిసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, మిల్లర్లతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రైస్ మిల్లర్లు అండర్​టేకింగ్ ఇస్తే ధాన్యం కేటాయిస్తారని బ్యాంకు గ్యారంటీలకు వారం రోజుల గడువుంటుందని పేర్కొన్నారు.

ఇప్పటికే పెండింగ్ ఉన్న సీఎంఆర్ అప్పగింత విషయంలో నవంబర్ చివరి నాటికి ప్రభుత్వం గడువు పొడిగించిందని, కాబట్టి వేగంగా ఎఫ్ సీ ఐకి బియ్యం అప్పగించాలని చెప్పారు. సమావేశంలో సివిల్ సప్లై డిఎం ఇర్ఫాన్, సివిల్ సప్లై ఆఫీసర్​ కాశీ విశ్వనాథ్​, వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.