గూడూరు, వెలుగు: హాస్టల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్య వివరాలను ప్రతి రోజూ నమోదు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆదేశించారు. శనివారం రాత్రి ఆయన గూడూరు మండలంలోని కస్తూర్బా, బాలుర ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.
వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజన వివరాలపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.