మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి : ​కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి : ​కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు : రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలని మహబూబాబాద్ ​కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. సోమవారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో రైస్ మిల్లర్లు నిర్దేశించిన ప్రకారం బ్యాంకులకు ఒప్పందాలు సమర్పించాలని, సీఎంఆర్ డెలివరీ తర్వాత లారీలను వెంటనే పంపాలని కోరారు.

సన్న, దొడ్డు రకాలు కేంద్రాల్లో మ్యాచ్చర్ వచ్చిన తర్వాత ధాన్యం స్వీకరించాలన్నారు. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, మహబూబాబాద్ డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు అంబరీశ్, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రాజు, డీసీవో వెంకటేశ్వర్లు, డీఏవో విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్​ వివిధ శాఖల అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. మొత్తం 73 వినతులు వచ్చాయని కలెక్టర్​తెలిపారు.