అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలోని నాలుగు మునిపాలిటీల్లో డెవలప్​మెంట్ వర్క్స్ స్పీడప్ చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం కలెక్టరేట్​లో ​సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల్లో అంతర్గత పనులు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, డివైడర్స్, మున్సిపల్ కార్యాలయ భవనాలు, ఇతర పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ఏబీసీ సెంటర్ పరిధిలో క్లినిక్ ను నిర్వహించాలని, ఎల్ఆర్ఎస్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీంలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు శాంతి కుమార్, రవీందర్, నరేశ్ రెడ్డి, వెంకటస్వామి, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, డీఈ ఉపేందర్, డీటీపీసీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​పట్టణంలోని జువైనల్ హోమ్, ఇందిరానగర్, హెల్త్ సబ్ సెంటర్, అంగన్​వాడీ సెంటర్, ఏబీసీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జువైనల్ హోమ్ లో అనాథ పిల్లలు, వివిధ కేసుల్లో ఉన్న 11 మంది బాల నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని సూపరింటెండెంట్ కృష్ణవేణి, సునీల్ బాబును ఆదేశించారు. శనిగపురంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్​ను పరిశీలించారు. ఇందిరానగర్ లోని హెల్త్ సబ్ సెంటర్, అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ తదితరులున్నారు.