![మెడికల్ కాలేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-advait-kumar-singh-has-ordered-the-officials-to-complete-the-medical-college-building-work-quickly_RE9NuzBVnb.jpg)
మహబూబాబాద్/ నెల్లికుదురు, వెలుగు: మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చెప్పారు. బుధవారం మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కాలేజీ హాస్టల్, వసతులు, కరెంట్, తాగునీటి సౌకర్యాలపై ఆరా తీశారు. స్టూడెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రిన్సిపాల్ లకావత్ వెంకట్ కు సూచించారు.
అనంతరం నెల్లికుదురు కేజీవీబీను ఆకస్మిక తనిఖీ చేశారు. కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారులు తమ పర్యటనలో భాగంగా అన్ని వసతి గృహాలను సందర్శించాలని సూచించారు. కేజీబీవీ ప్రిన్సిపల్ ఇల్లందుల సుమలత, సిబ్బంది పాల్గొన్నారు.