అభివృద్ధి పనులు స్పీడప్ ​చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

అభివృద్ధి పనులు స్పీడప్ ​చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు : జిల్లాలోని మరిపెడ, డోర్నకల్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మరిపెడ నుంచి మహబూబాబాద్ రోడ్డు, రాజీవ్ విగ్రహం, కార్గిల్ చౌరస్తా, మాకుల పెద్ద చెరువు, డోర్నకల్ గొల్ల బజార్, టీచర్స్ కాలనీ, ముత్యాలమ్మ గుడి రోడ్డు, భగత్ సింగ్ విగ్రహం సెంటర్, బతుకమ్మ పార్క్ లలో మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు.

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధి పనులు నిర్వహించేందుకు అవసరమైన చోట ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ విభాగం ఆఫీసర్లను ఆదేశించారు. పన్నుల వసూళ్ల లక్ష్యం పూర్తి చేయాలని, పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యం తడి చెత్త, పొడి చెత్త లపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటస్వామి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.