స్ట్రాంగ్ రూంను పరిశీలించిన కలెక్టర్​ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ రాంనాథ్ కేకన్ మంగళవారం పరిశీలించారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల స్ట్రాంగ్ రూంను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్లు, మౌలిక  సదుపాయాలను పరిశీలించారు.

 వారివెంట అడిషనల్​కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఎం.డేవిడ్, ఆర్డీవో అలివేలు, ఏఎస్పీ చెన్నయ్య, డిప్యూటీ సీఈవో నర్మద, డీపీవో హరిప్రసాద్, డీహెచ్ఎస్వో మరియన్న, గ్రౌండ్ వాటర్ డీడీ సురేశ్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.