రాజీవ్ యువవికాస పథకానికి అప్లై చేసుకోవాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

రాజీవ్ యువవికాస పథకానికి అప్లై చేసుకోవాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
  • సన్న బియ్యం అర్హులకు పంపిణీ చేయాలి

నెల్లికుదురు, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తు దారుల ఆన్‌లైన్  నమోదు ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్వయంగా పరిశీలించారు. దరఖాస్తుదారులకు సేవా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 దరఖాస్తుదారులకు ఈ పథకంలో వర్తించే అన్ని వివరాలు తెలియజేయాలని సూచించారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని రేషన్ దుకాణం నెంబర్ 1, ను తనిఖీ చేసి డీలర్ బుజ్జమ్మతో మాట్లాడారు.  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అర్హులైన రేషన్ కార్డు దారులందరికి అందించాలని సూచించారు.  నెల్లికుదురు తహసీల్దార్ కోడి చింతల రాజు,ఎంపీడీఓ బాలరాజు తదితరులు ఉన్నారు.