నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే, పాఠశాలలు, వసతి గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసముద్రంలో చేస్తున్న సర్వేను పరిశీలించి సమాచారం పక్కగా ఉండాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాజరు పట్టిక, మందుల స్టాక్, పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఎ.రవీందర్ రెడ్డి, అధికారులున్నారు.