- మహబూబాబాద్ కలెక్టర్ ఉత్తర్వులు
తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎంపీడీవో నరసింగరావును సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పెద్ద వంగర మండలం బొమ్మకల్లు పంచాయ తీ అకౌంట్ నుంచి అక్రమంగా ఉపాధి హామీ నిధులు రూ. 1.10 లక్షలు విత్ డ్రా చేశాడు.
ఈనెల 4న పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి సంతకాలు లేకుండానే ఎంపీడీవో నరసింగరావు తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు. దీంతో పంచాయతీ నిధులు అక్రమంగా ట్రాన్స్ ఫర్ చేసుకున్నట్టు తేలడంతో తొర్రూర్ ఎంపీడీవోను సస్పెండ్ చేశారు. పెద్దవంగర ఎంపీడీవో వేణుమాధవ్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వుల్లో తెలిపారు.