
మహబూబాబాద్/ జనగామ/ వరంగల్‌సిటీ/ ములుగు, వెలుగు: ఎల్ఆర్ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31లోగా అప్లై చేసుకుంటే 25 శాతం రాయితీ అవకాశాన్ని పొందవచ్చన్నారు. జనగామలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్పై గురువారం మున్సిపల్ ఆఫీస్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానాల నివృత్తికి కలెక్టరేట్లో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని 9948187334, మున్సిపల్ ఆఫీస్‌లో 8978207205 కు కాల్ చేయాలని సూచించారు.
వరంగల్ బల్దియా కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాఖాడే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం కావాలని సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, కాశీబుగ్గ ఖాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సీపీని ఆదేశించారు. ములుగు కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ నిర్వహించిన సమీక్షలో మాట్లడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.