కౌటింగ్​ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కౌటింగ్​ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు : ఈ నెల 4న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో నిర్వహించనున్న మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్  పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. ఆదివారం ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. కౌటింగ్ కోసం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 టేబుల్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

వర్షం వచ్చినా కౌటింగ్​కు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. కేంద్రం సమీపంలో గట్టి పోలీస్​ బందోబస్త్ ఉండేలా చూడాలన్నారు. ఆయనవెంట అడిషనల్ కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పొ, ఆర్డీవో అలివేలు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు..