మహబూబాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులపై అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని, అధికారులు నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మలేరియా, పైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్, ఫీవర్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మలేరియా లార్వాలను డిస్కవర్ చేయాలని, పీహెచ్సీల పరిధిలోని, హాస్టల్స్ విజిట్ చేయాలని, జ్వరం వస్తే వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య సిబ్బంది మురుగు కాల్వలను శుభ్రపర్చాలని, ప్లాస్టిక్ ను నిరోధించాలని, వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టాలన్నారు.
ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడేగా పాటించాలన్నారు. అవసరమైన చోట వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్వో మురళీధర్, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రమీలా రావు, జడ్పీ సీఈవో నర్మద, డీపీవో హరిప్రసాద్, డీఈవో వి.రాజేశ్వర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.