కొత్తగూడ, వెలుగు : ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు ఆఫీసులను మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం తనిఖీ చేశారు. కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ బుక్స్ పంపిణీ కేంద్రం, తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీస్లు, పీహెచ్సీ, గిరిజన ఆశ్రమ హైస్కూళ్లను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇద్దరే స్టాఫ్ నర్సులు ఉండడంతో మిగతా వారందరికీ షోకాజ్ నోటీస్లు ఇవ్వాలని డీఎంహెచ్వో కళావతి భాయిని ఆదేశించారు.
గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ స్కూల్లో ఇద్దరే స్టూడెంట్లు ఉండడంతో మిగతా స్టూడెంట్లను కూడా తొందరగా రప్పించాలని టీచర్లను ఆదేశించారు. గంగారంలోని తహసీల్దార్ ఆఫీస్, కొత్తగా నిర్మించిన కస్తూర్బా స్కూల్, పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆయనవెంట గంగారం తహసీల్దార్ రాము, ఎంపీడీవో అప్పారావు, ఎంపీవో సత్యం ఉన్నారు.