ప్రజా పాలన కళాయాత్రను విజయవంతం చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: ప్రజా పాలన కళాయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం జెండా ఊపి ప్రచార రథం  ప్రారంభించారు. ప్రజా విజయోత్సవాలు  డిసెంబర్​7 వరకు జిల్లాలోని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహిళాశక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై టీం లీడర్లు గిద్దె రాంనరసయ్య, బండ వెంకన్న, రవీందర్ గౌడ్, నేతృత్వంలో  ప్రచారం చేయనున్నారు.

మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో, ప్రతి మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో  డిపిఆర్ వో  పి.రాజేంద్రప్రసాద్, డీసీఓ వెంకటేశ్వర్లు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వడ్డేబోయిన శ్రీనివాస్, డిహెచ్ఎస్​ వో  మరియన్న, డీఏవో విజయనిర్మల,తదితరులు పాల్గొన్నారు.