జిల్లా యంత్రాంగం న్యాయం వైపు ఉంటుంది : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

 జిల్లా యంత్రాంగం న్యాయం వైపు ఉంటుంది : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: జిల్లా యంత్రాంగం న్యాయంవైపు ఉంటుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో  జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నర్మదా అధ్యక్షతన నిర్వహించారు. 

కలెక్టర్​మాట్లాడుతూ మహబూబాబాద్, తొర్రూరు డివిజన్​లో మొత్తం 46 ఎస్సీ, ఎస్టీ కేసులకు ప్రభుత్వం తరఫున వారికి రూ.11.75 లక్షల నష్టపరిహారం పంపిణీ చేయమన్నారు. ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ మాట్లాడుతూ జిల్లాలో 147 కేసులు నమోదయ్యాయని, వివిధ కారణాలవల్ల 22 కేసులు పెండింగ్​లో ఉన్నాయని, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, తొర్రూరు, మహబూబాబాద్ ఆర్డీవోలున్నారు.