
మెదక్‌టౌన్, వెలుగు: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ సూచించారు. శనివారం మెదక్కలెక్టర్ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిజాయితీగా పనిచేయాలన్నారు. ఎలాంటి పొలిటికల్పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదని సూచించారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నగదు, మద్యం పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగదు సీజ్ చేసినప్పుడు తప్పకుండా రశీదు అందించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. శనివారం సంగారెడ్డి కలెక్టర్ఆఫీసులో ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆ రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు.
26న స్క్రూటిని, 29న విత్ డ్రా, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన నేపథ్యంలో ప్రజలు అధిక మొత్తంలో నగదును తరలించవద్దని, రు 50 వేల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఆ పై వాటికి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుందన్నారు. అడిషనల్కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో పద్మజారాణి ఉన్నారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట: ఎలక్షన్ కమిషన్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమాళి అమలులోకి వచ్చిందని కలెక్టర్ మనుచౌదరి వెల్లడించారు. శనివారం సిద్దిపేట్కలెక్టర్ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్కలెక్టర్ గరిమ అగర్వాల్‌తో కలిసి మాట్లాడారు. మెదక్ లోక్ సభ పరిధిలోకి దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు, కరీంనగర్ లోక్ సభ పరిధిలోకి హుస్నాబాద్, యాదాద్రి భువనగిరిలోక్ సభ పరిధిలోకి జనగామ శాసనసభ పరిధిలోని 4 మండలాలు వస్తాయని తెలిపారు.
ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైనందున ఆర్వోలందరూ ఈసీఐ గైడ్లైన్స్ప్రకారం పని చేయాలని సూచించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 626 లొకేషన్ల లో 562 నార్మల్, 64 క్రిటికల్ లొకేషన్స్ గుర్తించినట్టు తెలిపారు. జిల్లా పరిధిలో 11 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్స్, 13 ఎస్ఎస్ టీ టీంలు, 26 ఎంసీసీ టీమ్‌లు, 103 రూట్లు, 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.