రైతులకు రుణాలు ఇవ్వకుంటే ఎట్లా? : కలెక్టర్​ అంకిత్

రైతులకు రుణాలు ఇవ్వకుంటే ఎట్లా? : కలెక్టర్​ అంకిత్
  • టార్గెట్​లో 38 శాతం  లోన్​లపై అసంతృప్తి
  • బ్యాంకర్ల మీటింగ్​లో అదనపు కలెక్టర్​ అంకిత్​ 

నిజామాబాద్,  వెలుగు :  రైతులకు పంట రుణాలు నిర్దేశించిన టార్గెట్​ మేరకు ఇవ్వకపోవడం ఏమిటని అదనపు కలెక్టర్​ అంకిత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రుణాలు అందని వారు  ప్రైవేట్​వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుంటే వారు ఆర్థికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బ్యాంకర్లతో మొదటి త్రైమాసిక మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. ఖరీఫ్​లో రూ.2,640 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని టార్గెట్​ కాగా రూ.1011.95 కోట్లు మాత్రమే ఇచ్చారని, 38 శాతం క్రాప్​ లోన్లు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. కొన్ని బ్యాంకులు రుణాల కోసం వచ్చే రైతులను చిన్నచూపు చూసే ధోరణి మారాలన్నారు. 

గత ఖరీఫ్​లో 74 శాతం, యాసంగిలో 95 శాతానికి మించి పంట రుణాలు అందించిన బ్యాంకులు ఖరీఫ్​లో ఎందుకు లక్ష్యం చేరుకోలేదని మండిపడ్డారు. రుణమాఫీ  విషయంలో రైతులను ఇబ్బందిపెట్టొదని  వార్నింగ్​ ఇచ్చారు. గవర్నమెంట్ స్కీంలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లోన్లు ఇవ్వాలని, స్వయం సహాయ సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ

ముద్ర  రుణాలు అందివ్వాలని కోరారు. యూత్​ ఉపాధి లోన్లను ఎంకరేజ్​ చేయాలని, వచ్చే మీటింగ్​నాటికి మార్పు కనబడాలని సూచించారు. ఆర్​బీఐ ఏజీఎం పృథ్వీ, డీఆర్డీవో సాయాగౌడ్, లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ అశోక్​ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్​కుమార్, మెప్మా పీడీ రాజేందర్,​ ఆయా శాఖల ఆఫీసర్లు ఉన్నారు.