హైదరాబాద్ సిటీ, వెలుగు : పదో తరగతి పరీక్షల్లో హైదరాబాద్ జిల్లా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని టీచర్లకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. 90 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైన స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో, డిప్యూటీ ఈవోను ఆదేశించారు. బేగంపేట్ హైస్కూల్–2ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్వాటర్ ట్యాంక్, పరిసరాలు, హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.
థర్డ్క్లాస్స్టూడెంట్స్తో పాఠాలు చదివించి, అభినందించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించారు. భయంతో కాకుండా పట్టుదలతో చదివి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ఇందుకు రాబోయే మూడు నెలలు కీలకమన్నారు. డీఈఓ రోహిణి, ఈఈ షఫీ మియా, డిప్యూటీ ఈవో శ్రీధర్, డిప్యూటీ ఈఈ సంజీవ్ ఉన్నారు.