ఇండ్ల పట్టాలు సిద్ధం చేయండి... కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఇండ్ల పట్టాలు సిద్ధం చేయండి... కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలోని డబుల్​బెడ్​రూమ్​ఇండ్లతోపాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అప్లికేషన్లు, రెవెన్యూ అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల వారీగా రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. జమునా నగర్, తార్నాకలో అర్హులైన పేదలకు డబుల్​బెడ్​రూం ఇండ్లు అందించే దిశగా పట్టాలను సిద్ధం చేయాలన్నారు. పెండింగ్ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. అడిషనల్​కలెక్టర్(రెవెన్యూ )ముకుంద రెడ్డి, డీఆర్వో వెంకటాచారి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరామ్, పాల్గొన్నారు.

పిల్లలు నేరాలకు, వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకు సైదాబాద్ ప్రభుత్వ బాలుర చిల్డ్రన్స్ హోమ్ లో డీ అడిక్షన్ సెంటర్ ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సోమవారం చిల్డ్రన్స్ హోం ను సందర్శించిన డి అడిక్షన్ కేంద్రం కోసం పలు భవనాలను పరిశీలించారు. ప్రభుత్వ బాలుర హోంను విజిట్​చేసి అందులోని పిల్లల వసతి, ఆహారం, ప్రైమరీ స్కూల్​, కిచెన్, ఆఫీసును పరిశీలించారు. ఆర్చరీ క్రీడా మైదానాన్ని పరిశీలించి ఆర్చరీలో రాష్ట్ర స్థాయికి ఎదిగిన పిల్లలతో మాట్లాడారు.

అంతకు ముందు ప్రజావాణిలో పాల్గొని కలెక్టర్​అనుదీప్​ఫిర్యాదులు స్వీకరించారు.  255 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణి ఫిర్యాదు లు స్వీకరించారు. 50 ఫిర్యాదులు అందాయి. వికారాబాద్​కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్ ఫిర్యాదులు స్వీకరించారు. 132 ఫిర్యాదులు అందాయి.