పదిలో 100 శాతం రిజల్ట్​ సాధించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పదిలో 100 శాతం రిజల్ట్​ సాధించాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • స్లో లెర్నర్స్ పై టీచర్లు స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి
  • అమ్మ ఆదర్శ పాఠశాల పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలి
  • హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్ ​దురిశెట్టి ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: జిల్లాలోని టెన్త్ క్లాస్ స్టూడెంట్లు వంద శాతం పాస్​పర్సంటేజ్​సాధించేలా చూడాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డిప్యూటీ ఐఓఎస్ లను ఆదేశించారు. టీచర్లు స్టూడెంట్ల పఠన, గ్రహణ శక్తిపై దృష్టి పెట్టాలని, స్లో లెర్నర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ఎంఎన్ఓలు, ఈఈ, ఏఈఈలతో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, ఎఫ్ఎల్ఎన్, ఎస్ఎస్ సీ రిజల్ట్స్, యూడీఐఎస్ కార్యక్రమాలపై మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. 

డిప్యూటీ ఐఓఎస్ లు తమ పరిధిలోని స్కూళ్లలో వంద శాతం ఎఫ్ఎల్ఎన్ సందర్శన చేయాలని చెప్పారు. అకడమిక్ ఇయర్ లో ఇంకా 50 రోజులు మిగిలి ఉన్నందున, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డిప్యూటీ ఐఓఎస్ లు, ఎంఎన్ఓలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు రెగ్యులర్ సందర్శనలో భాగంగా స్టూడెంట్ల రీడింగ్​కాంప్రెహెన్షన్ కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయాలని సూచించారు. గతేడాది జిల్లాలోని పదో తరగతి స్టూడెంట్లలో 86.8 శాతం మంది మాత్రమే పాస్​అయ్యారని, ఈసారి 100 శాతం సాధించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ ఆర్.రోహిణి, డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్ లు,ఈఈ, ఏఈలు, ఎంఎన్ఓలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.