- 8 సెంటర్లలో గ్రూప్-1 మెయిన్స్
- ఈ నెల 21 నుంచి 27 వరకు పరీక్షలు
- హాజరుకానున్న 5,613 మంది అభ్యర్థులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని 8 సెంటర్లలో గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఎగ్జామ్స్(కన్వెన్షనల్ /డిస్క్రిప్టివ్ టైప్) జరుగుతాయని, 5,613 మంది అభ్యర్థుల హాజరుకానున్నారని వెల్లడించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎగ్జామ్స్జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సెంటర్లోకి అనుమతిస్తామని, ఎగ్జామ్కు అరగంట ముందే గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు.
డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే, అభ్యర్థి మూడు ఫొటోలతో గెజిటెడ్ఆఫీసర్సంతకం చేయించాలని, www.tspsc.gov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్ ప్రకారం హాల్టికెట్ ఉండాలని చెప్పారు.