భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: లైసెన్స్‌లేకుండా నర్సరీలు ఏర్పాటు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో నర్సరీ పెంపకం దారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 33 నర్సరీలు ఉన్నాయన్నారు. లైసెన్స్ పొందిన వారు మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు దారులకు పక్కాగా రశీదు ఇవ్వాలన్నారు.
ఆరుబయట పెంచే నారును కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. నాణ్యమైన నారును అందించడం ద్వారా అధిక దిగుబడులు వస్తాయన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యక్తుల సమాచారం అందించాలన్నారు. మీటింగ్‌లో జేడీఏ అభిమన్యుడు, హార్టికల్చర్ఆఫీసర్ మరియన్న, ఏడీఏ లాల్‌చంద్, కేవీకే సైంటిస్టులు నారాయణమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.