![14 మంది వెల్ఫేర్ సిబ్బందికి వన్ డే శాలరీ కట్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-anudeep-took-action-against-officials-for-cutting-one-days-salary-of-14-welfare-staff_d3tCRD8irN.jpg)
- ‘వెలుగు’ కథనానికి స్పందన..
- అధికారులపై చర్యలు తీసుకున్న కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఆఫీసులో అటెండెన్స్ వేసుకొని శుక్రవారం జిల్లా వెల్ఫేర్ఆఫీసర్అక్కేశ్వర్రావు ఇంట్లోని ఫంక్షన్‌కు వెళ్లిన హైదరాబాద్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని ఉద్యోగులపై కలెక్టర్ అనుదీప్‌దురిశెట్టి సీరియస్అయ్యారు. వెల్ఫేర్ఆఫీసులోని పరిస్థితిని, అధికారుల తీరును వివరిస్తూ ‘ఉద్యోగులు ఫంక్షన్‌కు.. ఆఫీస్గాలికి’ హెడ్డింగ్‌తో శనివారం ‘వెలుగు’లో పబ్లిష్అయిన కథనానికి స్పందించి చర్యలు తీసుకున్నారు. సీసీఏ రూల్స్ ప్రకారం 14 మందికి ఒకరోజు వేతనం కట్‌చేశారు. అలాగే ఒకరోజు వారి సర్వీస్ ను కౌంట్ చేయొద్దని ఎఫ్ఆర్–18 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
14 మందిలో సూపరింటెండెంట్ మహమ్మద్ నుస్రత్ అలీ, సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్ వసీమ్, జూనియర్ అసిస్టెంట్ కె. కవిత, డేటా ఎంట్రీ ఆపరేటర్ జి.కవిత, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఎం.అరవింద్ కుమార్, డిప్యూటేషన్ స్టాఫ్.. సూపరింటిండెంట్ జీవీ సత్యనారాయణరావు, ఈఓ గ్రేడ్1 ఎస్ఏ శైలజ, సీనియర్ అసిస్టెంట్ మోఖిమ్ ఖురేషి, జూనియర్ అసిస్టెంట్ వై.సాయికృప, డిస్ట్రిక్ట్ హబ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ స్టాఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బి.భరత్, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.లక్ష్మీతేజస్విని, జండర్ స్పెషలిస్ట్2 డి.దీపిక, అకౌంట్స్ అసిస్టెంట్ కె.కీర్తి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కె.సరిత ఉన్నారు.
ఎంక్వైరీ చేశాకే చర్యలు తీసుకున్నారా?
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అనుదీప్తరచూ ఉద్యోగులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొందరికి షోకాజ్ లు ఇచ్చి సస్పెండ్ కూడా చేశారు. అయితే వెల్ఫేర్ఆఫీస్ఘటనలో మాత్రం కొందరి ఉద్యోగులపైనే చర్యలు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా విమెన్అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసులో దాదాపు 50 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. శుక్రవారం ఇద్దరు ఉద్యోగులు మినహా ఆఫీసులో ఎవరూ లేరు.
అయితే కలెక్టరేట్‌నుంచి 14 మందిపై చర్యలు తీసుకుంటున్నట్లు నోట్రావడంపై విమర్శలు వస్తున్నాయి. మిగతా వాళ్లంతా ఎక్కడికి వెళ్లినట్లు? ఫీల్డ్ లో ఉన్నారా? లేక లీవ్‌లో ఉన్నారా? తెలియాల్సి ఉంది. ఎంక్వెరీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విమెన్అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి వచ్చిన అటెండెన్స్ రిజిస్టర్ ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు సమాచారం.