పనులు వేగంగా జరగాలి : కలెక్టర్​ అనురాగ్​ జయంతి

వేములవాడ, వెలుగు : వేములవాడ మినీ స్టేడియం నిర్మాణ పనులు వేగంగా జరగట్లేదని, ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్​ అనురాగ్​ జయంతి అదేశించారు. బుధవారం పట్టణంలోని మినీ స్టేడియం, ఫుట్ పాత్ నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మల్లారం జంక్షన్ నుంచి కోరుట్ల బస్టాండ్ వరకు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రధాన రహదారికి ఇరువైపులా చేపట్టిన ఫుట్ పాత్ పనులను పరిశీలించారు.

విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలని సూచించారు. కలెక్టర్ వెంట టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, పంచాయతీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డీఈఈ తిరుపతి, ఏఈ లు, తదితరులు ఉన్నారు.