రాజన్నసిరిసిల్ల, వెలుగు: 3న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. , ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ అధికారులు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. లెక్కింపు రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపాలన్నారు.
కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తమకు నిర్దేశించిన విధుల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యుత్అంతరాయం లేకుండా చూసుకోవడంతోపాటు జనరేటర్, నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను నిబంధనలను అనుసరించి భద్రపరచాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఇన్‌చార్జి అడిషనల్కలెక్టర్ గౌతమ్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్, మధుసూదన్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బి.గంగయ్య పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్గవర్నమెంట్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్పమేలా సత్పతి శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. కార్యక్రమంలో రిటర్నింగ్అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బండ రమణారెడ్డి, సత్తినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.