మల్కపేట రిజర్వాయర్​ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలి : అనురాగ్ జయంతి

కోనరావుపేట, వెలుగు :  మల్కపేట రిజర్వాయర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను  ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ ​రిజర్వాయర్ ను  సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఇప్పటికే ట్రయల్ రన్‌‌‌‌‌‌‌‌లో రెండు పంపులు సక్సెస్ అయ్యాయన్నారు.

వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వారి వెంట అడిషనల్​ఎస్పీ చంద్రయ్య,  ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ నాగేంద్ర చారి, ఎస్డీసీ గంగయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డీఈలు ఉన్నారు.