రాజన్న సిరిసిల్ల, వెలుగు : సమాజాన్ని శాంతియు తంగా ఉంచడమే పోలీసుల లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నా రు. శుక్రవారం పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని జిల్లాలోని చందుర్తి మండలం లింగంపేట లో పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు అక్టోబర్ 21 నుంచి 31 వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి పోలీసుల త్యాగాలు గుర్తుంచుకునేందుకు ప్రభుత్వం అక్టోబరు 21న అమర వీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లు విశ్వప్రసాద్, రవికుమార్, ఆర్ఐలు రజినీకాంత్, యాదగిరి, సీఐ లు శ్రీలత, వెంకటేశ్,బన్సీలాల్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల త్యాగాలు మరువలేనివి
జగిత్యాల: పోలీస్అమరుల త్యాగాలు మరువలేనివని జగిత్యాల కలెక్టర్ రవి అన్నారు. స్థానిక పోలీస్ఆఫీస్ లో బుధవారం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అమర వీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ సింధు శర్మ, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రామాంజనేయులు, ప్రకాశ్, రవీంద్ర రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని: పోలీస్ అమర వీరులను స్ఫూర్తిగా తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పెద్దపల్లి డీసీపీ రూపేశ్‌తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మోహన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‍టౌన్: పోలీస్అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఫ్లాగ్ డేలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ లో 48 మంది పోలీసులు అసాంఘిక శక్తులపై జరిపిన పోరులో ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఏసీపీలు శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, సత్యనారాయణ తదితరులు
పాల్గొన్నారు.