ఐదు రోజుల ముందుగానే ఓటర్లకు స్లిప్పులు: ఆశిష్ సంఘ్వాన్

నిర్మల్, వెలుగు:  ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఐదు రోజుల ముందుగానే ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను అందించనున్నట్లు  కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి  మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు.  ఖానాపూర్  నియోజకవర్గంలో  244  లొకేషన్ల పరిధిలో 305 పోలింగ్ స్టేషన్లు‌, నిర్మల్ నియోజకవర్గంలో 190 లొకేషన్ల పరిధిలో 305 పోలింగ్ స్టేషన్లు‌,  ముదోల్ నియోజకవర్గంలో 230 లొకేషన్ల పరిధిలో 311 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల  ఖర్చుపై  నిఘా సారిస్తున్నామన్నారు.

 ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వీఎస్టీలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయన్నారు.  ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే  సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు  స్వీకరిస్తామన్నారు.  మీడియాలో  ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ కమిటీ  అనుమతి  తీసుకోవాలన్నారు. సువిధ యాప్ ద్వారా ర్యాలీలు, మీటింగ్ లు, లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు అనుమతులు తీసుకో వా లన్నారు. జిల్లాకు ఇప్పటికే ప్రత్యేక బలగాలు చేరుకున్నాయన్నారు. ఓటర్లు  స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరా రు.  కార్యక్రమంలో  డీపీఆర్వో తిరుమల, తదితరులు పాల్గొన్నారు.